Om bhoorbhuvah swah|
Tat Savitur Varenyam
Bhargo Devasya Dhimahi
Dhiyo Yonah Prachodayat. ||
| Yajur 36-12 & Rig 3-62-10|
ఓ౩మ్ భూర్భువః స్వః| తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి|
ధియో యో నః ప్రచోదయాత్ ||
|| యజు 36-12 & ఋక్ 3-62-10||
ओ३म् भूर्भुवः॒ स्वः।
तत्स॑वि॒तुर्वरे॑ण्यं॒
भर्गो॑ दे॒वस्य॑ धीमहि।
धियो॒ यो नः॑ प्रचो॒दया॑त् ॥
॥ yajur 36-3 & rig 3-62-10॥
O men! we meditate upon and try to imbibe in us, that most desirable light of God which eradicates sins and Who is the Creator and Parameshwar of the world. He is resplendent and illuminator of all and Omnipresent and indwelling spirit, so that He may inspire and purify our intellects to perform always good deeds.
ఓ మానవులారా! మనమెల్లరము (య) ఏ (నః) మనయొక్క (ధియం) బుద్ధులను (ప్రచోదయాత్) ఉత్తమగుణ కర్మ స్వభావములందు
ప్రేరణ మొనర్చనో, అట్టి (సవితుః) సంపూర్ణవిశ్వమును ఉత్పన్నమొనర్చువాడు మరియు సమస్త ఐశ్వర్యములతో గూడిన స్వామి, మరియు (దేవస్య)
సకలైశ్వర్యములదాత, ప్రకాశవంతుడు, సర్వమును ప్రకాశపరచువాడు, సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామిని (తత్) అట్టి (వరేణ్యమ్) సర్వోత్తముడు,
వరించదగిన (భర్గ:) పాపరూప రుఃఖముల మూలమును నష్టపరచు ప్రభాశాలిని (ధీమహి) ధారణమొనర్తుము
భావార్థము:- ఏ మనుష్యులు సర్వసాక్షి, తండ్రివంటివాడు, న్యాయకారి, దయాళువు, శుద్ధుడు, సనాతనుడు, సర్వాత్మల సాక్షియగు
ఆపరమాత్మనే స్తుతి ప్రార్థనలచే ఉపాసించెదరో ఆయనను దయాసాగరుడు, సర్వశ్రేష్టుడగు, పరమేశ్వరుడు మనను దుష్టాచరణలనుండి
వేరుగానుంచి శ్రేష్ఠ ఆచరణములందు ప్రవృత్తిపరచి పవిత్రము మరియు పురుషార్థపరులనుగా చేసి ధర్మార్థ కామమోక్షములను ప్రాప్తింపజేయుగాక!
जो मनुष्य सबके साक्षी, पिता के सदृश वर्त्तमान, न्यायेश, दयालु, शुद्ध, सनातन, सबके आत्माओं के साक्षी परमात्मा की ही स्तुति और प्रार्थना करके उपासना करते हैं, उनको कृपा का समुद्र सबसे श्रेष्ठ परमेश्वर, दुष्ट आचरण से पृथक् करके श्रेष्ठ आचरण में प्रवृत्त करा और पवित्र तथा पुरुषार्थयुक्त करके धर्म, अर्थ, काम और मोक्ष को प्राप्त कराता है|
Om tach-chakṣhur-devahitam purastaach-chhukram-uchcharat
pashyema sharadaḥ shatañ
jeevema sharadaḥ shatam̈
shṛiṇuyaama sharadaḥ shatam
pra bravaama sharadaḥ shatam
adeenaaḥ syaama sharadaḥ shatam
bhooyash-cha sharadaḥ shataaat.
ఓ౩మ్ తచ్ఛక్షుర్దేవహితం పురాస్తాచ్ఛుక్రముచ్చరత్| పశ్యేమ శరదః శతం
జీవేమ శరదః శతం శృణుయామ శరదః శతం ప్ర బ్రవామ శరదః
శతమదీనాః స్యామ శరదః శతం భూయశ్చ శరదః శతాత్ || యజు 36-24||
तच्चक्षु॑र्दे॒वहि॑तं पु॒रस्ता॑च्छु॒क्रमुच्च॑रत्। पश्ये॑म श॒रदः॑ श॒तं जीवे॑म श॒रदः॑ श॒तꣳ शृणु॑याम श॒रदः॑ श॒तं प्र ब्र॑वाम श॒रदः॑ श॒तमदी॑नाः स्याम श॒रदः॑ श॒तं भूय॑श्च श॒रदः॑ श॒तात्||
His is the Divine Eye that shows the way to all righteous people. Everywhere we turn, we find His Eye present in front of us, shedding Light, and ever watchful of our movements. May we live for a hundred years and, in our daily life perceive His living Presence in all our actions. For a hundred years may we listen to His Glory and Majesty as described in the Knowledge He revealed (in Vedas, Upanishads etc.), and even proclaim such Glory for all to hear. With God as our Guide, may we never be subjected for a hundred years, and even for more than a hundred years.
సర్వద్రష్ట, విద్వాంసులకు పరమ హితకారకుడు, సృష్టికి పూర్వము, అనంతరము, మధ్యలోను సత్య స్వరూపమున ఉండు వాడు,
సకల సృష్టి కర్తయును అగు
ఆ బ్రహ్మను మేము వంద సంవత్సరముల పర్యంతము చూచుదుము గాక! వంద సంవత్సరముల పర్యంతము జీవింతుము గాక!
వంద సంవత్సరముల వరకు విందుము గాక! వంద సంవత్సరముల వరకు ఆ బ్రహ్మనే ఉపదేశింతుము గాక! అతని కృపచే
వందసంవత్సరముల వరకు
ఎవరికిని ఆధీనులము కాక స్వతంత్రులమై జీవింతుము గాక! ఆ పరమేశ్వరుని ఆజ్ఞనే పాలింతుము గాక!
మా శరీరము ఆరోగ్యమును కలిగి, ఇంద్రియములు బల దాయకములై , మనస్సు పవిత్రమై , ఆత్మ ఆనందముతో ఉండు గాక!
हे परमेश्वर ! आपकी कृपा और आपके विज्ञान से आपकी रचना को देखते हुए आपके साथ युक्त नीरोग और सावधान हुए हम लोग समस्त इन्द्रियों से युक्त सौ वर्ष से भी अधिक जीवें, सत्य शास्त्रों और गुणों को सुनें, वेदादि को पढ़ावें, सत्य का उपदेश करें, कभी किसी वस्तु के विना पराधीन न हों, सदैव स्वतन्त्र हुए निरन्तर आनन्द भोगें और दूसरों को आनन्दित करें ॥२४
Om praatharagnim praatharindram havaamahe
Praatharmitraa varuNaa praatharshvinaa|
Praatharbhagam pooShaNam brahmaNaspatim
Praathah sOma mutha rudram huvEma||
ఓం ప్రాతరగ్నిం ప్రాతరిన్ద్రం హవామహే
ప్రాతర్మిత్రా వరుణా ప్రాతరశ్వినా|
ప్రాతర్భగం పూషణం బ్రహ్మణస్పతిం
ప్రాతః సోమ ముత రుద్రం హువేమ ॥1||
ఋగ్వేదం (7-41-4), యజు, (34-34), అథర్వ (3-16-1)
प्रा॒तर॒ग्निं प्रा॒तरिन्द्र॑ꣳ हवामहे
प्रा॒तर्मि॒त्रावरु॑णा प्रा॒तर॒श्विना॑।
प्रा॒तर्भगं॑ पू॒षणं॒ ब्रह्म॑ण॒स्पतिं॑
प्रा॒तः सोम॑मु॒त रु॒द्रꣳ हु॑वेम ।।
We invoke God at dawn, we pray for progress at dawn, we practice breath control at dawn, we respect father and mother at dawn. At dawn we invoke God, the Parameshwar of the Vedas, the sustainer of All, and Adorable by all. We use medicinal herbs in the morning and at dawn, we try to realise the true nature of soul.
ఓ అంతర్యామీ! ఈ ప్రభాత ప్రశాంత సమయాన నీ జ్ఞాన ప్రకాశాన్ని నీ ఐశ్వర్యశక్తిని మాలోనికి ఆహ్వానించుచున్నాము. ఈ ప్రాతఃకాలాన మాకు పరమమిత్రుడవు, శ్రేష్ఠశాసకుడవు, లోకాలోకాలు (సృష్టి ప్రలయాలు) చేయగల అశ్వినీశక్తులు గల నిన్ను మాలోనికి సాదరంగా ఆహ్వానించు చున్నాము. భజనీయుదవు, బ్రహ్మాండ పోషకుడవు, వేదజ్ఞాన ప్రదాతవు అయిన నిన్ను స్వాగతించు చున్నాము. నీవు సత్పురుషలకు సౌమ్యుడవు. దుష్టులకు రుద్రడవు. నీలో సహనము మన్యువు అనంతంగా ఉన్నాయి. అట్టి దివ్యగుణయుక్త పరమేశ్వరా! నీకు మా సాదర స్వాగతం.
जो मनुष्य प्रातःकाल परमेश्वर की उपासना, अग्निहोत्र, ऐश्वर्य की उन्नति का उपाय, प्राण और अपान की पुष्टि करना, अध्यापक, उपदेशक, विद्वानों तथा ओषधि का सेवन और जीवात्मा को प्राप्त होने वा जानने को प्रयत्न करते हैं, वे सब सुखों से सुशोभित होते हैं |
Om praatharjitam bhagamugram huvEma
Vayam putra maditheryO vidharthaa |
Aadhrashchidyam manya maanasthu rashchid
Raajaachidyam bhagam bhaksheethyaah ||
(Rig 7-41-2, yaju 34-35, athar 3-16-2)
ఓం ప్రాతర్జితం భగముగ్రం హువేమ
వయం పుత్ర మదితేర్యో విధర్తా |
ఆధ్రశ్చిద్యం మన్యమాన స్తురశ్చిద్
రాజాచిద్యం భగం భక్షీత్యాహ ||
प्रा॒त॒र्जितं॒ भग॑मु॒ग्रꣳ हु॑वेम
व॒यं पु॒त्रमदि॑ते॒र्यो वि॑ध॒र्त्ता।
आ॒ध्रश्चि॒द्यं मन्य॑मानस्तु॒रश्चि॒द्
राजा॑ चि॒द्यं भगं॑ भ॒क्षीत्याह॑ ।।
At dawn we invoke the victorious Mighty Bhaga, God the only object of adoration, the creator of the sun which is situated in the atmosphere and the upholder and sustainer of all, the knower of all beings, the Imperial ruler, the chastiser of evil doers. He admonishes us to worship Him so we invoke alone.
భావార్థము :- ఈ ప్రభాత ప్రశాంత సమయాన సదా జయశీలుడు, సర్వైశ్వర్యకర్త దుష్టులయెడ ఉగ్రుడు, ఆకాశ పుత్రునివలె భాసించు సూర్యుని ధరించువాడు అయిన సర్వాంతర్యామిని మాలోనికి సాదరంగా ఆహ్వానించు చున్నాము. సర్వ విధాల ధారణ చేయతగినవాడు, మాననీయుడు, శీఘ్రకారి, విశ్వప్రకాశకుడు ఐశ్వర్యప్రదాత అయిన దేవదేవుని మాత్రమే మేము ఉపాసింతుము గాక! ఆ దేవుని యథార్థ స్వరూపాన్నే ఇతరులకు ఉపదేశింతుము గాక!
इस मन्त्र में वाचकलुप्तोपमालङ्कार है। हे मनुष्यो ! तुम लोगों को सदा प्रातःकाल से लेकर सोते समय तक यथाशक्ति सामर्थ्य से विद्या और पुरुषार्थ से ऐश्वर्य की उन्नति कर आनन्द भोगना और दरिद्रों के लिये सुख देना चाहिये, यह ईश्वर ने कहा है
Om bhagapraNetharbhaga satyaraadhO
BhagEmaam dhiyamudavaadannaha |
bhaga pra NO janaya gobhirashvair
Bhaga pra nribhirnrivantah syaama ||
Rig (7-41-3), yaju (34-36) , athar (3-16-3)
ఓం భగ ప్రణేతర్ భగ సత్యరాధో
భగేమాం ధియ ముద వాదదన్నః ।
భగ ప్రణో జనయ గోభి రశ్వై:
భగ ప్రనృభిర్ నృవంతః స్యామ ॥
भग॒ प्रणे॑त॒र्भग॒ सत्य॑राधो॒
भगे॒मां धिय॒मुद॑वा॒ दद॑न्नः।
भग॒ प्र नो॑ जनय॒ गोभि॒रश्वै॒:
भग॒ प्र नृभि॑र्नृ॒वन्तः॑ स्याम ||3||
O Bhaga; (Parameshwar, the only object of adoration) Thou art the leader of all beings and O Bhaga; (Parameshwar, the only object of adoration) Thou art Parameshwar of all eternal substances, please confer on us the supreme wisdom and shield us form danger. O Bhaga; (Parameshwar, the only object of adoration) please augment our earthly possession by bestowing on us kine and horses and O Bhaga; (Parameshwar the only object of adoration) let us become rich in men and heroes.
తాత్పర్యం : - హే భగవాన్! పరమైశ్వర్యశాలీ! మమ్ము ఐశ్వర్యవంతుల మగుటకు ప్రేరేపింపుము. మా బుద్ధులలో వసించి ధర్మమార్గాన ధనవంతులమగుటకు మమ్ము ప్రేరేపింపుము. పుణ్య కార్యాలను చేయ ప్రేరేపింపుము. కేవలం ధన ధాన్య సంపదలనేగాక, గో అశ్వాది సంపదలను, ఉత్తమ సంతాన సంపదను కూడా పొంద ప్రేరేపింపుము. నీ కృపవలన మేము ఉత్తమ నాయకులు గలవారమై, మేమును ఉత్తమ నాయకుల మగుదుము గాక!
मनुष्यों को चाहिये कि जब-जब ईश्वर की प्रार्थना तथा विद्वानों का सङ्ग करें, तब-तब बुद्धि की ही प्रार्थना वा श्रेष्ठ पुरुषों की चाहना किया करें।
Om Utedaanim Bhagavantah Syaama
Utaprapitva uta madhE ahnaam|
Uthodita Maghavan Tsuryasya.
Vayam DEvaanaam Sumatau Syaama ||4||
ఓం ఉతేదానీం భగవంతః స్యామ
ఉతప్రపిత్వ ఉత మధ్యే అహ్నామ్।
ఉతోదితా మఘవన్ త్సూర్యస్య
వయం దేవానాం సుమతౌ స్యామ ॥ 4॥
उ॒तेदानीं॒ भग॑वन्तः स्यामो॒त प्र॑पि॒त्वऽउ॒त मध्ये॒ऽअह्ना॑म्।
उ॒तोदि॑ता मघव॒न्त्सूर्य्य॑स्य व॒यं दे॒वाना॑ सुम॒तौ स्या॑म ||
यजुर्वेद (34 -37)
O Noble pure Parameshwar, may prosperity be ours at present, in future during the day time! May we, 0 Bounteous Lord, at the rising of the sun, be happy, in the wake of excellent wisdom of the learned.
సరళార్థం : హే మఘవన్! సకలైశ్వర్య ప్రదాతా! మేము ఈ ప్రభాత ప్రశాంత ఉపాసనా కాలంలోనూ, పూర్వాహ్న, మధ్యాహ్న, అపరాహ్న కాలాల్లోనూ రోజంతా దైవీసంపదతో వర్ధిల్లునట్లు అనుగ్రహింపుము. ఉదయించే సూర్యుని చూస్తూ మేమును ఉన్నతిని పొందుదుము గాక! దేవతల సుమతులలో- దివ్యగుణయుక్తులైన సాధుమహాత్ముల సత్సంగాలలో గడుపుదుము గాక! అట్టివారు ఆ సమయమున లభించకున్న మహర్షుల గ్రంథాల స్వాధ్యాయంలో గడుపుదుము గాక!
मनुष्यों को चाहिये कि वर्त्तमान और भविष्यत् काल में योग के ऐश्वर्यों की उन्नति से लौकिक व्यवहार के बढ़ाने और प्रशंसा में निरन्तर प्रयत्न करें |
Ōṁ bhaga ēva bhagavānastu dēvā
stēna vayaṁ bhagavantaḥ syāma।
tantvā bhaga sarva ijjōhavīti
sanō bhaga pura ētā bhavēha॥
ఓం భగ ఏవ భగవానస్తు దేవా
స్తేన వయం భగవంతః స్యామ।
తంత్వా భగ సర్వ ఇజ్జోహవీతి
సనో భగ పుర ఏతా భవేహ॥
- బుుగ్వేదం (7-14-15), యజు (34-38)
भग॑ऽए॒व भग॑वाँ२ऽअस्तु देवा॒स्तेन॑ व॒यं भग॑वन्तः स्याम। तं त्वा॑ भग॒ सर्व॒ऽइज्जो॑हवीति॒ स नो॑ भग पुरऽए॒ता भ॑वे॒ह
O learned person, God verily is supreme. May we become supreme through Him. O God, all invoke Thee. O supreme God, be Thou our leader in this world.
హే భగవాన్! సకలైశ్వర్యయుక్త పరమేశ్వరా! నీ కృపవలన మేమును దివ్యగుణాలతో దేవతలమగుదుము గాక! నిన్నుపాసించుటవల్ల మేమును సంపన్నుల మగుదుము గాక! నీవు భగవంతుడవు - సకలైశ్వర్య ప్రదాతవు కనుకనే జనులంతా నిన్నే స్తుతిస్తారు. ప్రార్ధిస్తారు. అగ్నిహోత్రంలో ఆహుతులిస్తారు. అట్టి నీవే మాకు మార్గదర్శకుడవై మమ్ము సుపథాన నడిపింపుము. ఐశ్వర్యవంతులను, దివ్యగుణ సంపన్నులను చేయుము.
हे मनुष्यो ! तुम लोग जो समस्त ऐश्वर्य से युक्त परमेश्वर है, उनके और जो उसके उपासक विद्वान् हैं, उनके साथ सिद्ध तथा श्रीमान् होओ। जो जगदीश्वर माता-पिता के समान हम पर कृपा करता है, उसकी भक्तिपूर्वक इस संसार में मनुष्यों को ऐश्वर्यवाले निरन्तर किया करो |